Padaharu Phalala Nomu Katha Telugu PDF download free from the direct link given below in the page.

 

Padaharu Phalala Nomu Katha Telugu

“పదహారు ఫలల నోము కథ” ఒక తెలుగు చిన్న కథ చరిత్ర. ఈ కథ కోసం గురుతు చేసిన గొప్ప రచయిత లొకేష్వరరావు కి కృష్ణమూర్తి ముగ్గినంత గొప్ప స్థాయి ప్రాప్తవేశం ఉంది. ఈ కథ ఒక అర్థమయిన పాత్రను అనుసరించి, నేర్చుకుంటుంది మరియు కుట్రలను బాధించే పారిశుధ్ధ అందం ఉన్నారు. ఈ కథ ప్రతిపాదించే సందేశం ప్రేమ, సహనం మరియు ప్రతిస్పందన పై ఆధారపడింది. పదహారు ఫలల నోము కథ అనేది సహనం మరియు ప్రేమకు సంబంధించిన ఒక తెలుగు చిన్న చిరుత కథ చరిత్ర.

పదహారు ఫలాల నోము పూర్తి కథ

పూర్వకాలంలో ఒకానొక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారి భార్య మంత్రి భార్య ఇధ్దరు కలిసి పదహారు ఫలాల నోము నోచుకున్నారు. ఆ రాజు భార్యకు గుణ హీనులు, గ్రుడ్డివారు కుంటివారు కుమారులుగా పుట్టారు. మంత్రి భార్యకు రత్నమానిక్యాల్లాంటి సుగుణ గుణ సంపన్నులు కుమారులు కూడా కలిగారు. ఇందుకు రాజు భార్య ఎంతగానో భాద పడేవారు . మంత్రి భార్యను కలుసుకుని ఏమమ్మా! నువ్వు నేను కలిసే గదా పదహారు ఫలాల నోమును నోచుకున్నాము. మరి నాకిట్టి బిడ్డలు, నీకు అటువంటి బిడ్డలు పుట్టుటకు కారణమేమిటి రాజు భార్య అడిగింది.

 

అందుకా మంత్రి భార్య బాగా ఆలోచించి రాణి గారికి ఈ విధంగా చెప్పింది. మహారాణి! మీరు పూజ కాలంలో వినియోగించే పళ్ళను ఒక రోజు ముందుగానే తెఛ్చి వాటిని కోటలో నోలివచేసినారు. వాటిలో వున్న పళ్ళు వంకర పళ్ళు, మచ్చలున్న పళ్ళు, పాడిన పళ్ళను గుర్తించక, వాటిని వేరుచేయక మీరు పేరంటాల్లకు పంచి పెట్టారు. అలా అశ్రద్ధ చేసినందువల్ల మీకు కలిగిని సంతానం కుంతీ, గుడ్డి, గునహీనులు అయ్యారు. మీరు విచారించకండి ఈ పదహారు ఫలాల నోము చాలా శక్తివంతమైన నోము, స్త్రీలపాలిట పెన్నిది. కనుక మీరు మరలా పదహారు ఫలాల నోమును నోయండి. చక్కనైనవి శుబ్రమైనవిగా వున్న ఫలాలను సమకూర్చుకుని వాటిని ముత్తైదువులకు పువ్వులు, దక్షిణ తామ్బూలాడులతో వాయనమివ్వండి అని మంత్రి భార్య చెప్పింది.

 

రాణి మంత్రి భార్య చెప్పిన ప్రకారం మంచి పళ్ళను సమకూర్చుకుని, ఎంతో భక్తి శ్రద్దలతో పదహారు ఫలాల నోమును కూడా నోచుకున్నది. అలా ఈ నోము విశేషం వలన ఆమె సంతానం సర్వాంగ సుందరంగా మారడం కూడా జరిగింది. అందుకా రాణి ఎంత గానో ఆనందించింది.